రెడ్డి రాజులు
రెడ్డి రాజులు రెడ్డి రాజ్య వ్యవస్థాపకుడు, హరవీర భయంకరుడు, రెడ్డి రాజులలో అగ్రగణ్యుడు, గొరిల్లా యుద్ద కళ రూపకర్త అయిన ప్రోలయ వేమారెడ్డి గురించి తెలుసు కుందాం. ఈయన కాకతీయ ప్రతాపరుద్రుడి సామంత రాజులు అయిన 72 సామంత రాజులలో ఒకడు. ప్రతాప రుద్రున్ని ఢిల్లీ సుల్తాన్ భందించిన తర్వాత సామంత రాజులందరూ ఢిల్లీ సుల్తానుకు సామంత రాజులు గా మారిపోయారు. కానీ అందులో ముగ్గురు మాత్రం స్వాతంత్ర రాజులుగా ప్రకటించుకున్నారు. వారిలో ప్రోలయ వేమారెడ్డి ఒకడు. ఈయన కాక ముసునూరు కాపనాయకులు, హోయాలుల రాజైన మూడవ వీర బల్లాలుడు కూడా ఉన్నాడు. ఆ విధంగా 1323 ప్రాంతంలో కొండవీడు రాజధానిగా స్వాతంత్ర రెడ్డి రాజ్యం పురుడుపోసుకుంది. ఈ ముగ్గురు ఇలా స్వతంత్ర రాజులుగా ప్రకటించుకోవడం తో, కోపోద్రిక్తుడైన సుల్తాన్ మూడు రాజ్యలపై ఒకే సమయం లో దండేతెందుకు వీలుగా మూడు సేనలను ఒకేసారి సిద్దం చేశాడు. అయితే సైన్యం తక్కువగా వున్న గొరిల్లా యుద్ద కలలో ఆయితెరిన ప్రోలయ వేమారెడ్డి, తమ్ముడు మల్లారెడ్డి సహాయంతో తురుష్కం సైన్యాన్ని అంతమొందించగలిగాడు. ...