గౌతమి పుత్ర శాతకర్ణి
గౌతమి పుత్ర శాతకర్ణి
భారతదేశాన్ని పాలించిన రాజుల్లో అతి గొప్పరాజు ఎవరు అంటే సాధారణంగా ఓ అశోకుడు,అక్బరో, ఓ శివజనో లేదంటే ఓ శ్రీకృష్ణదేవరాలు గుర్తుకు వస్తారు.
అయితే విజయాల్లోను, సామ్రాజ్య విస్తరణలో పాలన దక్షతలోను, పౌరుషం లోనూ దేనిలోనూ ఎవరు సాటి రాలేని ఓ భారతీయ పరిపాలకుడు వున్నాడు. ఈ విశాల భారతావనిలో అతనితో సరితూగగల రాజులేవరు లేరంటే అతశయోక్తి కాదు. అయితే అచ్ఛ తెలుగు చక్రవర్తి గౌతమి పుత్ర శాతకర్ణి.
భారత దేశాన్ని పరిపాలించిన శాతవాహన సామ్రాజ్యం లోని గొప్ప రాజుల్లో శాతకర్ణి అగ్రగణ్యుడు. శాతవాహన సామ్రాజ్యం ఎక్కడ వుండేది. ప్రస్తుత భౌగోళిక స్వరూపం ప్రకారం చెప్పాలంటే పక్షిమ డెక్కన్ ప్రాంతం అంటే తెలంగాణ, ఉత్తర కర్ణాటక, దక్షిణ మహారాష్ట్ర, మరియు ఆంధ్రప్రదేశ్ లో శాతవాహన సామ్రాజ్యం విస్తరించి వుండేది.
శాతవాహనుల మొదటి తరం పాలకులందరూ మహారాష్ట్ర లోని ప్రతిష్ఠను పురాన్ని రాజధానిగా చేసుకుంటే ఆ తరువాత వచ్చిన పాలకులు ఆంధ్ర ప్రాంతం లోని అమరావతిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. అయితే శాతవాహనుల మూలాల గురించి ఏ శాసనాలలోనూ స్పష్టంగా లేదు. వీళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళని కొందరు చెబితే, లేదు ఉత్తర తెలంగాణకు చెందిన వాళ్ళని మరికొందరు వాదిస్తారు.
శాతవాహన వంశానికి శ్రీకారం చుట్టిన మొదటి వ్యక్తి సిముఖుడు ఈయననే శ్రిముఖుడు అంటారు. ఈయన 23 యేళ్లు పాటు విజయవంతంగా పాలన సాగించాడు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటక, ఈ మూడింటి సంయుక్త ప్రాంతాన్ని విజయవంతంగా పరిపాలించాడు. శాతవాహన రాజ్య స్థాపనకు పూర్వం సిముఖుడు అశోకుడి దగ్గర యుద్ద నిర్వాహకుడుగా పనిచేసేవాడు. పని చేసింది కొద్ది కాలమే అయిన అశోక సామ్రాజ్యంలో అత్యంత గౌరవం సంపాదించుకున్నాడు. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు విరక్తి చెంది సామ్రాజ్యాన్ని వదిలిపెట్టి సన్యాసి కావడం అతడి కుమారుడు, కుమార్తె, భౌద్ధ ధర్మ ప్రచారానికి పూనుకోవడం మనకి తెలిసిందే, అశోక విచ్ఛిన్నం కాగానే అంతకాలం అతడి సామంతులుగా పాలన సాగిస్తువస్తున్న చిన్న చిన్న రాజులంతా తమని తాము స్వతంత్రులుగా ప్రకటించుకున్నారు. ఇలా స్వయం పాలకులుగా ప్రకటించుకున్న వారిలో సిముఖుడు కూడా ఒకడు. అప్పటికి మహారాష్ట్ర దక్షిణ భాగంతో పాటు ఆంధ్ర ప్రదేశ్ మొత్తం అతడి పాలనలోనే వుండేది. శాతవాహన సామ్రాజ్య పాలకులు మొత్తం 40 మంది అయితే వారిలో 23 వ వాడు ఈ గౌతమి పుత్ర శాతకర్ణి. శాతవాహన స్థాపకుడు సిముఖుడు మూడు నాలుగు రాష్ట్రాల ప్రాంతాన్ని మాత్రమే పరిపాలిస్తే గౌతమి పుత్ర శాతకర్ణి దాదాపు భారతదేశంలో సగభాగాన్ని తన పాలన లోకి తెచ్చుకున్నాడు.
గౌతమి పుత్ర శాతకర్ణి శివ స్వాహి, గౌతమి బాలస్వి దంపతులకు పుట్టాడు. తనకు ఎంతో ఇష్టమైన ఎంతగానో ప్రభావితం చేసిన తల్లి గౌతమి దేవి పేరుని తన పేరు ముందు పెట్టుకుని గౌతమి పుత్ర శాతకర్ణి గా మారాడు. అప్పటి నుండి శాతవాహన రాజులందరూ తమ పేరుకి ముందు తల్లి పేరుని జత చేయడం సంప్రదాయంగా మారింది. ముఖ్యంగా ఇది శాతవాహనుల సాంప్రదాయం.
గౌతమి పుత్ర శాతకర్ణి కాలంలో శాతవాహన రాజ్యం మునుపెన్నడూ లేనంత వైభవంగా మారింది. శాతవాహన వంశం మొత్తం మీద అతి ప్రతిష్టాత్మకమైన చక్రవర్తి గా శాతకర్ణి పేరు తెచ్చుకున్నాడు. అతడి జీవిత చరిత్ర పరిపాలన విధానం జైత్రయాత్ర ను ఇంకా అతడి జీవితం లోని అనేక ఘటనలకు సంభందించిన విశేషాలు నాసిక్ ప్రసిస్త అనే గ్రంధం లో కన్పిస్తాయి. ఆ గ్రంథం రాసింది ఎవరో కాదు శాతకర్ణి తల్లి బాల స్వి యే.
గౌతమి పుత్ర శాతకర్ణి తన తల్లి కంటే ముందుగానే మరణించాడు. అతడి మరణం తర్వాత ఆమె ఈ గ్రంధాన్ని రచించారు. శాతకర్ణి విశేషాలు తెలుసుకోవడానికి చరిత్ర కారులకి కీలకమైన ఆధారం ఈ పుస్తకమే. ఇప్పుడు అసలు గౌతమి పుత్ర శాతకర్ణి విజయాల గురించి మాట్లాడుకుందాం.
గౌతమి పుత్ర శాతకర్ణి శకుల్ని, పల్లవుల్ని, యమనులని చిత్తుగా ఓడించారు. ఆ కాలం లో నేహా భానుడి పరిపాలనలో శక వంశం చాలా బలిష్టంగా వుండేది. శకవంశాన్ని జయించే సామర్ధ్యం కోసం శాతకర్ణి దాదాపు పదహారు సంవత్సరాల పాటు తీవ్రంగా శ్రమించాడు. అయితే ఇతడి ప్రయత్నాలు సాగుతున్న సమయంలోనే శకవంశ పాలకుడు నేహ పానుడు శాతవాహనుల నుంచి పక్షిమ డెక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసేసుకున్నాడు. దీంతో పౌరుష వంతుడైన గౌతమి పుత్ర శాతకర్ణి శకవంశం మీద ఓ సాహసోపేతమైన పోరాటం చేశాడు. We పోరాటం లో నేహపానున్ని అతని మంత్రి నేషా వదత్తున్ని చంపి పారేసి తన రాజ్యాన్ని దక్కించుకోవడం కాకుండా శకవంశం మీద ఘన విజయం సాధించాడు. ఆ తర్వాతి కాలంలో యమనుల్ని, పళ్ళవుల్ని కూడా దక్కన్ ప్రాంతం నుంచి తరిమేసి మహారాష్ట్ర లోని తన వంశీకుల మూల ప్రాంతమైన శాతవాహన ప్రాంతాన్ని కూడా వశం చేసుకున్నాడు. అంతే కాదు తన రాజ్యాన్ని గుజరాత్, బెనాల్, సౌరాష్ట్ర, మాల్వార్, ఉత్తర కొంకణ ప్రాంతానికి కూడా విస్తరించాడు. శక వంశం నిర్మూలన తర్వాత దక్షిణ ప్రాంతంలో శాతవాహన వంశం ఓ బలీయమైన శక్తిగా రూపుదిద్దుకుంది. గౌతమి పుత్ర శాతకర్ణి ఎన్నెన్నో ప్రాంతాలను జయించాడు. మహారాష్ట్ర, ఉత్తర మహారాష్ట్ర, కవియమడ్, పక్షిమా రాడ్డాన, విదర్భ, అవంతి, కొంకణ ఇలాంటి వన్నీ కూడా శాతకర్ణి వశమయ్యాయి. అతడి రాజ్యం ఎంత విస్తరించింది అంటే పక్షీమ కనుమల నుంచి మొదలుపెట్టి, తూర్పు కనుమల వరకు ట్రావిన్ కోర్ ప్రాంతం తో పాటు శాతవాహనుల యేలు బడిలోకి వచ్చింది. రాజ్య విస్తరణ చేయడమే కాదు, శాతవాహన సామ్రాజ్య పాలకులందరిలోను గౌతమి పుత్ర శాతకర్ణి ఓ విశిష్టమైన పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు. శాతవాహనులు జన్మతః బ్రాహ్మణులు అయితే తరువాతి కాలంలో భౌద్ధ మతాన్ని స్వీకరించి భౌడ్డులుగా మారారు. శాతకర్ణి కి బుద్దుడు అంటే అత్యంత భక్తి ప్రభక్తులు వుండేవి. శాతవాహన సామ్రాజ్య రాజధాని మొదట్లో మహారాష్ట్రలో వుండేది. ఆ తరువాతి కాలంలో అమరావతి శాతవాహనుల రాజధాని అయ్యింది. శాతవాహనుల సామ్రాజ్య రాజధానిని అమరావతికి తీసుకువచ్చింది శాతకర్ణి. శాతకర్ణి కాలం నాటి శాసనాలు బుద్ధ ప్రతిమలు ఇప్పటికీ అమరావతిలో మనం చూడవచ్చు.
Comments
Post a Comment