రెడ్డి రాజులు
రెడ్డి రాజులు
రెడ్డి రాజ్య వ్యవస్థాపకుడు, హరవీర భయంకరుడు, రెడ్డి రాజులలో అగ్రగణ్యుడు, గొరిల్లా యుద్ద కళ రూపకర్త అయిన ప్రోలయ వేమారెడ్డి గురించి తెలుసు కుందాం.
ఈయన కాకతీయ ప్రతాపరుద్రుడి సామంత రాజులు అయిన 72 సామంత రాజులలో ఒకడు. ప్రతాప రుద్రున్ని ఢిల్లీ సుల్తాన్ భందించిన తర్వాత సామంత రాజులందరూ ఢిల్లీ సుల్తానుకు సామంత రాజులు గా మారిపోయారు. కానీ అందులో ముగ్గురు మాత్రం స్వాతంత్ర రాజులుగా ప్రకటించుకున్నారు. వారిలో ప్రోలయ వేమారెడ్డి ఒకడు. ఈయన కాక ముసునూరు కాపనాయకులు, హోయాలుల రాజైన మూడవ వీర బల్లాలుడు కూడా ఉన్నాడు. ఆ విధంగా 1323 ప్రాంతంలో కొండవీడు రాజధానిగా స్వాతంత్ర రెడ్డి రాజ్యం పురుడుపోసుకుంది. ఈ ముగ్గురు ఇలా స్వతంత్ర రాజులుగా ప్రకటించుకోవడం తో, కోపోద్రిక్తుడైన సుల్తాన్ మూడు రాజ్యలపై ఒకే సమయం లో దండేతెందుకు వీలుగా మూడు సేనలను ఒకేసారి సిద్దం చేశాడు. అయితే సైన్యం తక్కువగా వున్న గొరిల్లా యుద్ద కలలో ఆయితెరిన ప్రోలయ వేమారెడ్డి, తమ్ముడు మల్లారెడ్డి సహాయంతో తురుష్కం సైన్యాన్ని అంతమొందించగలిగాడు.
మరోపక్క హొయసలుల రాజైన మూడవ వీర బాల్లాలుడు మాత్రం శత్రు సేనలకు చిక్కాడు. సుల్తాన్ మీదకు ఏవరైన తిరగ బడితే భల్లాలుని మరణంతో వణుకు పుట్టించాలని భావించిన సుల్తాన్ మూడవ వీర భల్లలుని మధురైలో నీ ఒక గుడి ముందు ధ్వజ స్తంభానికి కట్టి వేయించి చర్మం వలిపించాడు. అయినా ఇవేమీ లెక్క చేయని ప్రోలయ వేమారెడ్డి రెడ్డి సామ్రాజ్యాన్ని తీర ప్రాంతం వెంబడి విస్తరించగలిగాడు.
ఒకవైపు విజయనగర రాజులు, మరోవైపు గజపతులు, ఇంకోవైపు ఢిల్లీ సుల్తానులు ఇంత బలమైన శత్రువుల మధ్య ఈనయ రెడ్డి సామ్రాజ్యాన్ని విస్తరించగలిగాడు అంటే ఎంతటి వీరుడో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు ఇంత భీతి గొలిపే యుద్దాలు చేస్తూన్న ఆయన ఎప్పుడు ప్రజా సంక్షేమాన్ని మాత్రం విస్మరించలేదు. అప్పటి సమాజంలో ప్రజలు శైవులు, వైష్ణవులు గా విడిపోయి ఒకరి పట్ల ఒకరు ద్వేష భావంతో మసలుకునేవారు
ప్రోలయ వేమారెడ్డి శివ కేశవులు మధ్య విభేదాలను తొలగించడానికి చాలా కృషి చేశాడు. శివులకు ఎంతో పుణ్య క్షేత్రమైన శ్రీశైలము ను, వైష్ణవులకు ఎంతో గొప్ప పుణ్య క్షేత్రమైన అహోబిలం ను ఏక కాలంలో పునర్వ్యవస్థీకరించగలిగాడు. అంతే కాక తెలుగులో మహాభారతాన్ని అనువదించిన కవిత్రయంలో ఒకరైన ఎర్ర ప్రగడ ేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేఈయన ఆస్థాన కవియే.
ఆవిధంగా కవి పండితులను కూడా సత్కరించిన ఘనత ప్రోలయ వేమారెడ్డి కి దక్కుతుంది. రెడ్డి రాజులు దేసటి వంశీయులు, ప్రోలయ వేమారెడ్డి రాజధాని అద్దంకి, ప్రోలయ వేమారెడ్డి పదవి కాలం క్రీ. శ. 1325 నుండి 1353 వరకు పరిపాలించాడు. ఈయనకు గల బిరుదు ధర్మ ప్రతిష్టాపన గురు.
రెడ్డి రాజులలో అగ్రగణ్యుడు అన వేమారెడ్డి ఈయన పరిపాలనా కాలంలో రెడ్డి రాజుల రాజదాని అద్దంకి నుండి కొండవీటి కి మార్చాడు. కర్పూర వసంత రాయలు గా పేరుపొందిన రెడ్డి రాజు కుమారగిరి రెడ్డి. ఈ కుమార రెడ్డి పరిపాలనా కాలంలో రెడ్డి రాజులలో అంతర్యుద్ధాలు ప్రారంభమయ్యాయి. కుమార రెడ్డి కాలంలో రెడ్డి రాజ్యం పై దాడి చేసిన విజనగర చక్రవర్తి రెండవ హరిహర రాయలు. రాజమండ్రి రెడ్డి రాజ్య స్థాపకుడు కాటాయ వేమారెడ్డి.
Comments
Post a Comment