శ్రీ పద్మనాభస్వామి
శ్రీ పద్మనాభస్వామి దేవాలయం పద్మనాభుడు అనగా నాభి (బొడ్డు) యందు పద్మమును కలవాడు అని అర్థం. శ్రీ పద్మనాభస్వామి దేవాలయం శ్రీ మహా విష్ణువు ఆలయం. ఈ ఆలయం భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని తిరువనంత పురంలో ఉంది. ఈ ఆలయం ప్రస్తుతం ట్రావెం కోర్ (travancore) రాజ కుటుంబం ధర్మకర్తల నిర్వహణలో నడుస్తుంది. చరిత్ర :- ట్రావెన్ కోర్ రాజ కుటుంబం చేర వంశానికి చెందిన వారు. అలాగే కుల శేఖర సన్యాసి ఆళ్వార్ సంతతి వారు. ఈ ఆలయం శ్రీ మహా విష్ణువు యొక్క 108 దివ్య దేశములలో ఒకటి. 108 దివ్య దేశములు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయాలు ఉన్న దివ్య క్షేత్రాలు అని అర్థం. శ్రీ మత్భాగవతంలో బలరామ దేవుడు తన తీర్థ యాత్రలో భాగంగా ఫాల్గుణ (ప్రస్తుత శ్రీ పద్మనాభస్వామి దేవాలయం) అనే ఈ దేవాలయాన్ని దర్శించి నట్లు, ఇక్కడ ఉన్న పంచప్సరసులో (పద్మ తీర్థం లో) స్నానం చేసినట్లు అలాగే పది వేల ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్లు తెలుస్తుంది. తమిళ ఆళ్వారులు రచించిన దివ్య ప్రభందం లో కూడా ఈ ఆలయం ప్రస్తుతించారు. (6...